Loading video

మార్స్‌పై రాత్రి.. ఎలా ఉంటుందో తెలుసా ??

|

Jan 24, 2025 | 12:02 PM

చీకటి పడిందంటే.. ఆకాశంలో చందమామ, నక్షత్రాలు కనువిందు చేస్తాయి. పౌర్ణమి వంటి సమయంలో అయితే వెన్నెలతో కాస్త వెలుగు ఎక్కువగా ఉంటే... అమావాస్య సమయంలో చీకటి దట్టంగా అలుముకుంటుంది. మరి మన సౌర కుటుంబంలో జీవం ఉనికి ఉండే అవకాశమున్న మార్స్‌ పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసా?

దీనికి సంబంధించి మార్స్‌ పై తిరుగాడుతున్న నాసా రోవర్‌ ‘క్యూరియాసిటీ’ అద్భుతమైన వీడియోలను చిత్రీకరించింది. వాటిని నాసా ఎక్స్‌ లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో పోస్టు చేసింది. భూమిపై మనం వాడే విద్యుద్దీపాల వెలుగు కారణంగా ఆకాశం సరిగా కనిపించదు. అందుకే నగరాలకు దూరంగా కొండలు, గుట్టల ప్రాంతాలకు వెళ్లి ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అంగారకుడిపై ఈ సమస్య లేదు. పైగా భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అందువల్ల అంతరిక్షం నుంచి వచ్చే వెలుగు నేరుగా ప్రసరిస్తూ ఉంటుంది. దీనితో అంగారకుడిపై రాత్రిపూట కూడా కొంత మేర వెలుతురు కనిపిస్తుంది. నక్షత్రాలు అయితే మరింత స్పష్టంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. మార్స్‌పై రాత్రి పూట ఎలా ఉంటుందో నాసా రోవర్‌ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ బెల్లం తింటే..కోపం తగ్గిపోతుందట..