Japan Moon Mission: చంద్రుడిపై ల్యాండింగ్‌కు జపాన్ వ్యోమనౌక సిద్ధం.. ఇస్రో సరసన జాక్సా చేరనుందా?

|

Jan 22, 2024 | 9:21 AM

భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ప్రపంచ దేశాలు చంద్రుడిపై కాలు పెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. గతేడాది జపాన్ ప్రయోగించిన వ్యోమనౌక స్లిమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకేందుకు మరో అడుగు దూరంలో ఉంది. అన్నీ అనుకూలిస్తే భారత కాలమానం ప్రకారం జనవరి 19 శుక్రవారం రాత్రి 8.50 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే చంద్రుడిపై ల్యాండర్‌ను దించాలని భావిస్తున్న జపాన్..

భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ప్రపంచ దేశాలు చంద్రుడిపై కాలు పెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. గతేడాది జపాన్ ప్రయోగించిన వ్యోమనౌక స్లిమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకేందుకు మరో అడుగు దూరంలో ఉంది. అన్నీ అనుకూలిస్తే భారత కాలమానం ప్రకారం జనవరి 19 శుక్రవారం రాత్రి 8.50 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే చంద్రుడిపై ల్యాండర్‌ను దించాలని భావిస్తున్న జపాన్.. ఇది కుదరకపోతే మరో నెల రోజుల తర్వాత దించేందుకు ఏర్పాట్లు చేసింది. గతేడాది సెప్టెంబర్ 7 వ తేదీన జపాన్ స్లిమ్ నౌకను ప్రయోగించింది. జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగితే ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, భారత్ దేశాలు చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా కాలుపెట్టగలిగాయి.

స్లిమ్ మిషన్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ అయిన ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. పేరులో ఉన్నట్లుగానే దూరపు లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలిగేదే ఈ మూన్ స్నైపర్. చంద్రుడిపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి ఖచ్చితంగా 100 మీటర్ల లోపే ల్యాండర్ దిగాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.830 కోట్లు. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కోసం జపాన్ చేపట్టిన మూడో ప్రయత్నం ఇది. తొలి ప్రయత్నంలో 2022లో ఒమతెనాషి ల్యాండర్‌ను చంద్రుడిపై దించే క్రమంలో జపాన్ అంతరిక్ష సంస్థ దానితో సంబంధాలు కోల్పోవడంతో మిషన్ ఫెయిల్ అయింది. ఇక 2023 లో రెండో ప్రయత్నం చేసిన జపాన్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ‘ఐ స్పేస్ ఇంక్’ కూడా హకుతో-ఆర్-1ను చంద్రుడిపై దించే క్రమంలో విఫలమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos