సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

Updated on: Jan 23, 2026 | 9:45 AM

ఇస్రో ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో లోతైన సముద్ర రహస్యాలను ఛేదిస్తోంది. మత్స్య 6000 సబ్ మెర్సిబుల్ ద్వారా మానవ సహిత పరిశోధనలకు సన్నాహాలు చేస్తోంది. అక్వానాట్స్ ఇప్పటికే 5000 మీటర్ల లోతుకు చేరి భారత రికార్డు సృష్టించారు. సముద్ర ఖనిజ సంపదను అన్వేషించడమే లక్ష్యం. అంతరిక్షంతో పాటు సముద్ర పరిశోధనల్లోనూ భారత్ ప్రపంచ దేశాల సరసన చేరడం గర్వకారణం.

అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో. 28 టన్నులు బరువున్న మత్స్య 6000 సబ్ మెరైన్ ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ పర్యవేక్షణలో సముద్రయాన్ మిషన్ స్టార్ట్‌ చేసారు. అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టే శాస్త్రవేత్తలను ఆస్ట్రోనాట్స్ అంటారు. అయితే సముద్రం లోపల పరిశోధనలు చేసే వాళ్లను ఆక్వానాట్స్. ఫ్రాన్స్ సహకారంతో భారత్ ఈ ప్రయోగం చేస్తోంది. ఎంపిక చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు సబ్ మెరైన్ లో వెళ్లి పరిశోధన చేపడతారు. అందులో ఇద్దరు భారతీయులు. జితేంద్ర పాల్ సింగ్, రాజు రమేష్ ఇప్పటికే 5000 మీటర్ల లోతుకి వెళ్లారు. ఇది భారత రికార్డుగా ఈ ప్రయోగం ద్వారా సాధించారు. ఈ సబ్మెర్సిబుల్ 12 గంటల పాటు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు కూడా సముద్రంలో ఉండే సామర్థ్యం దానికి ఉంది. ప్రయోగం ద్వారా సముద్రంలో ఉన్న ఖనిజ సంపద, మినరల్స్, కోరల్స్ ను కనిపెడతారు. వాటి ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తరహా ప్రయోగాలను ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా చేశాయి.. ఇప్పుడు ఇస్రో కూడా ఆ దేశాల సరసన చేరింది. ఇస్రో ఒకవైపు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతూనే సముద్రం లోపల శాస్త్రవేత్తల ద్వారా ప్రయోగ ప్రక్రియను పూర్తిచేసే దశలో ఉండటం మనందరికీ గర్వకారణం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌