మేడ్‌ ఇన్‌ ఇండియా సెమీ కండక్టర్‌ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్‌ ఆవిష్కరణ

Updated on: Sep 04, 2025 | 7:33 PM

ప్రధాని మోదీ శాసించారు.. భారత్‌ టెక్‌ నిపుణులు సాధించారు. యస్‌.. సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. భారత్‌ దేశీయంగా తయారు చేసిన తొలి చిప్‌ విక్రమ్‌-32 బిట్‌ ప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఇస్రోకు చెందిన సెమీకండక్టర్‌ లేబొరేటరీ అభివృద్ధి చేసిన మేడిన్‌ ఇండియా చిప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రధాని మోదీకి అందజేశారు.

సెమికాన్‌ ఇండియా-2025 సదస్సులో ఈ ఆవిష్కరణ జరిగింది. సెమీ కండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో 2021లోనే భారత్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ను ప్రారంభించింది. కేవలం మూడున్నర ఏళ్లలోనే ఇస్రో తొలి చిప్‌ను విక్రమ్‌-32ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విక్రమ్‌-32 అనేది కంప్యూటర్‌ చిప్‌. అంతరిక్షంలో ఎదురయ్యే అత్యంత కఠిన పరిస్థితులు, వాతావరణాన్ని సైతం తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఇది -55 డిగ్రీల నుంచి +125 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం తట్టుకోగలదు. ఈ చిప్‌లను రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్‌ వెహికిల్‌ ఏవియానిక్స్‌లో వాడనున్నారు. ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రాజెక్టులో విక్రమ్‌-32ను పరీక్షించి, అద్భుతంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. భారత్‌లో కొత్తగా ఐదు సెమీకండక్టర్‌ యూనిట్ల నిర్మాణం జరుగుతోందని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో రూ.1.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులతో 10 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. ప్రపంచ సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ ఓ వెలుగు వెలగనుందని చెప్పారు. సెమీకండక్టర్‌ డిజైన్‌ రంగంలో భారత్‌ కీలక శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్వాల్‌కామ్‌, ఇంటెల్‌, ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్‌, మీడియాటెక్‌ సంస్థలు బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడాల్లో పెద్ద పరిశోధన, అభివృద్ధి, డిజైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదిలిన ‘స్టార్ ఆఫ్ ది సీస్.. సముద్రంలో తేలుతూ తొలి ప్రయాణం!

బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం

72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం

మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..