Phone Charging: వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం ఎందుకు తగ్గుతుంది? కారణాలు ఇవే..!
వేసవిలో సూర్యుడి ప్రతాపం మూలంగా మనుషులే కాదు.. మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్లు వేగంగా వేడెక్కుతుంటాయి. బ్రౌజింగ్ చేసినా, గేమ్స్ ఆడినా బ్యాక్ ప్యానెల్ మొత్తం హీటెక్కిపోతుంది. అంతేకాదు.. వేసవిలో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వేగంలో తేడానూ గుర్తించవచ్చు. మునుపటితో పోలిస్తే
వేసవిలో సూర్యుడి ప్రతాపం మూలంగా మనుషులే కాదు.. మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్లు వేగంగా వేడెక్కుతుంటాయి. బ్రౌజింగ్ చేసినా, గేమ్స్ ఆడినా బ్యాక్ ప్యానెల్ మొత్తం హీటెక్కిపోతుంది. అంతేకాదు.. వేసవిలో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వేగంలో తేడానూ గుర్తించవచ్చు. మునుపటితో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ తగ్గడం గమనించొచ్చు. ఇంతకీ వేసవికి, ఛార్జింగ్ వేగం తగ్గడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకూ పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. వాటి వేగం, పనితీరులో చాలావరకు మార్పులు వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వేగం పెరిగింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెరిగింది. ఒకప్పుడు సన్‌లైట్‌లోకి తీసుకెళితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కనిపించేది కాదు. ఇప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఆ స్థాయిలో మెరుగైంది. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్ హీట్‌ను పెంచేవే. దీనికితోడు బీజీఎంఐ వంటి హై ఎండ్ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్ హీట్ పెరుగుతుంది. సాధారణ రోజుల కంటే వేసవిలో వేడిమి కారణంగా స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా హీటెక్కుతాయి. మరి వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం ఎందుకు తగ్గుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుఎకుందాం.