Motarola watch: మార్కెట్లోకి మోటోరోలా స్మార్ట్‌ వాచ్‌లు విడుదల.. ఫీచర్స్ మరియు ధర.. పూర్తి వివరాలు ఈ వీడియో లో

|

Nov 23, 2021 | 9:50 AM

ఇండియా మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ వాచ్‌లు విడుదల అవుతున్నాయి. తాజాగా మోటోరోలా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో వాచ్ 100 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం..


ఇండియా మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ వాచ్‌లు విడుదల అవుతున్నాయి. తాజాగా మోటోరోలా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో వాచ్ 100 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ వాచ్‌ రౌండ్‌ డిస్‌ప్లే ఉండే అవకాశం కనిపిస్తుంది. వాచ్ కుడివైపున రెండు బటన్లను అమర్చారు. ఈ వాచ్‌ 1.3 ఇంచుల ఎల్సీడీ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.రెజల్యూషన్ 360×360గా ఉండనుండగా.. వాచ్ బాడీ అల్యూమినియంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ బరువు 29 గ్రాములు. 20 మి.మీ వెడల్పుతో రాబోతున్నట్లు సమాచారం.

ఇక హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సెలోమీటర్, జైరోస్కోప్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్‌తో పాటు స్టెప్ కౌంట్, స్లిప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు పొందుపర్చారు. ఈ వాచ్‌ 300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉండగా, బడ్జెట్ ధరలో ఉండే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..