క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి..అందుబాటులోకి ‘రివర్ట్’ టెక్నాలజీ
ఇప్పటివరకు ప్రాణాంతక వ్యాధిగా భావిస్తునన క్యాన్సర్ విషయంలో అసలు భయమే అక్కర్లేదంటున్నారు పరిశోధకులు. అవును, మీరు విన్నది నిజమే. కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం తీసుకొచ్చిన ఆధునిక చికిత్సా విధానంతో.. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న లక్షలాది మరణాలకు ఇక చెక్ పడుబోతోంది.
ఈ టెక్నాలజీ సాయంతో.. పెద్ద పేగు, రొమ్ముతో సహా అనేక రకాల క్యాన్సర్లకు మెరుగైన చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఓ ప్రాణాంతక వ్యాధి. శరీరంలోని కణాలు నియంత్రణ కోల్పోయి విచ్చలవిడిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధికి చికిత్స సాధ్యమే కానీ.. ఫలితం మాత్రం నిర్దిష్టంగా ఉండటం లేదు. చాలా సార్లు చికిత్స తర్వాత కూడా శరీరంలో క్యాన్సర్ కణాలు మరో భాగంలో పెరగడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితిని రివర్స్ క్యాన్సర్ అంటారు. అయితే.. దక్షిణ కొరియా పరిశోధకులు.. క్యాన్సర్ కణాలను చంపకుండా వాటిని సాధారణ స్థితికి మార్చగల సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈ కొత్త టెక్నాలజీని దక్షిణ కొరియాకు చెందిన KAIST శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పేరు REVERT. ఈ అధ్యయనం క్యాన్సర్ చికిత్సలో ఒక పెద్ద ముందడుగు అంటున్నారు. KAIST కనుగొన్న కొత్త పద్ధతి క్యాన్సర్ కణాలను చంపకుండానే.. వాటిని సాధారణ, ఆరోగ్యకరమైన కణాల్లా ప్రవర్తించేలా రీప్రోగ్రామ్ చేస్తుంది. REVERT టెక్నిక్ తో కణాలు శరీరంలో మునుపటిలా పనిచేయడం ప్రారంభించినట్లు గమనించారు. ఒక సాధారణ కణం సహజమైన పద్ధతికి భిన్నంగా స్పందిస్తుంటే.. దానిని వెంటనే గమనించటం ఈ చికిత్సలో ప్రత్యేకత. క్యాన్సర్ ఏర్పడే కీలకమైన క్షణాన్ని పట్టుకోవడంలో తన బృందం విజయం సాధించిందని ప్రొఫెసర్ క్వాంగ్-హ్యూన్ చో చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇక కాల్స్ షెడ్యూలింగ్ సాధ్యమే
మీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా
హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు
రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు