ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!

Updated on: Dec 05, 2025 | 6:36 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ ట్యాక్సీ కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్‌లకు పోటీగా వచ్చిన ఈ సేవ డ్రైవర్లకు పూర్తి లాభాలు అందిస్తుంది. ఢిల్లీలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. సహకార సంఘాల మాదిరిగా పనిచేసే ఈ యాప్‌లో టూవీలర్, ఆటో, ఫోర్ వీలర్ సేవలు లభిస్తాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్‌ ట్యాక్సీ వచ్చేసింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్‌ ట్యాక్సీలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం క్యాబ్‌ సర్వీస్ తీసుకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ ట్యాక్సీ సర్వీసెస్ ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. అతి త్వరలో మిగతా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారత్ ట్యాక్సీ యాప్‌లో ఇప్పటి వరకు 51 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఢిల్లీలో భారత్ డిజిటల్ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌లో అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, ఎన్‌డీడీబీ, ఎన్సీఈఎల్, ఎన్‌సీడీసీ, నాబార్డ్‌లు ప్రమోటర్లుగా ఉన్నాయి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ- గవర్నెన్స్ డివిజన్ భారత్ ట్యాక్సీని అభివృద్ధి చేశాయి. భారత్ ట్యాక్సీ సర్వీసెస్…సహకార సంఘాల మాదిరిగా పనిచేస్తాయి. ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు జరుగుతుంది. టూవీలర్, ఆటోలు, ఫోర్ వీలర్ల సేవలు భారత్ ట్యాక్సీలో లభించనున్నాయి. కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా కో-ఆపరేటివ్ క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. భారత్ ట్యాక్సీ సేవలను ఉపయోగించడం ఎంతో సులభం. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు ఆపిల్ స్టోర్ నుంచి అధికారిక భారత్ టాక్సీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు పోటీగా భారత ట్యాక్సీ సర్వీసులను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్ ట్యాక్సీలోని వచ్చే లాభాలన్నీ డ్రైవర్లకే చెందుతాయి. యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలపై గత కొంతకాలంగా యూజర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. అధిక ధరలు, క్యాన్సిలేషన్లు సహా డ్రైవర్ల ఆదాయం నుంచి కంపెనీలు ఎక్కువగా కమీషన్ తీసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ తెచ్చింది. ‘భారత్‌ ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని డ్రైవర్లకే చెల్లిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్

మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే