Auto Driver Watch: వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

|

Sep 28, 2024 | 8:01 PM

భారతదేశం ఇప్పుడు పాత భారతదేశం కాదు. ఇది డిజిటల్ ఇండియా. క్యాష్‌ లావాదేవీలు తగ్గాయి. మనలో చాలామంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్‌ నుంచి మొదలు.. చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ల వరకు అందరూ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

భారతదేశం ఇప్పుడు పాత భారతదేశం కాదు. ఇది డిజిటల్ ఇండియా. క్యాష్‌ లావాదేవీలు తగ్గాయి. మనలో చాలామంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్‌ నుంచి మొదలు.. చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ల వరకు అందరూ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ‘పీక్ బెంగళూరు’కి ఇది మరో ఉదాహరణ అంటూ నెటిజన్లు అంటున్నారు. అసలు విషయంలోకి వెళితే..

ఆటోడ్రైవర్‌ తన స్మార్ట్‌వాచ్‌లోని క్యూఆర్ కోడ్‌ను తన ప్రయాణికుడికి చూపుతున్న ఫోటో వైరల్‌ అయింది. ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించుకున్నందుకు సోషల్ మీడియా వినియోగదారులు అతనిని ప్రశంసించారు. లక్షలాది మంది ఇది చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్‌పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అన్నా, మీరు మా అందరికీ స్ఫూర్తి అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, ఆటో అన్నా డిజిటల్‌గా మారిపోయాడు అంటూ మరొకరు రాశారు. ఈ ఆటో డ్రైవర్ చాలా తెలివైనవాడు, ఇది డిజిటల్ ఇండియా మాయాజాలం అని మరొ వ్యక్తి కామెంట్‌ పెట్టాడు. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరం అని మరొకరు, “బెంగళూరును భారతదేశంలోని టెక్ సిటీ అని ఎందుకు పిలుస్తారో దీన్ని బట్టే మీకు అర్థమవ్వాలి అని మరొక నెటిజన్‌ కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on