జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’
నాసా చేపట్టిన 'ఆర్టెమిస్-2' మిషన్ చంద్రుడి కక్ష్యలోకి నలుగురు వ్యోమగాములతో విజయవంతంగా దూసుకెళ్లింది. అపోలో 17 తర్వాత మానవులు చంద్రుడి వైపు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ 10 రోజుల యాత్రలో వ్యోమగాములు చంద్రుడిపై దిగకుండా, భద్రత, పనితీరును పరీక్షించి భవిష్యత్తులో మానవ నివాసాలకు మార్గం సుగమం చేయనున్నారు. 8 ఏళ్ల చిన్నారి తయారుచేసిన 'రైజ్' బొమ్మ కూడా అంతరిక్ష జిజ్ఞాసకు ప్రతీకగా ప్రయాణిస్తోంది.
1972లో జరిగిన అపోలో 17 తర్వాత మానవులు చంద్రుడి వైపు పయనమయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నలుగురు వ్యోమగాములతో వ్యోమనౌక, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం బయలుదేరింది. ఏళ్ల తరబడి జాప్యం, భారీ వ్యయ ప్రయాసల తర్వాత ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరెంజ్, తెలుపు రంగుల్లో ఉన్న భారీ రాకెట్ తీవ్రమైన శబ్దంతో నింగిలోకి దూసుకెళ్తుండగా, నాసా బృందాలు, అక్కడికి చేరుకున్న ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఆనందాన్ని తెలిపారు. ఈ యాత్రలో అమెరికాకు చెందిన రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఉన్నారు. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడిపై దిగరు. కేవలం జాబిల్లి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి వస్తారు. మానవులతో ఈ వ్యోమనౌక ప్రయాణించడం ఇదే తొలిసారి కావడంతో దాని భద్రత, పనితీరు, విశ్వసనీయతను ఈ యాత్రలో పరీక్షిస్తారు. ఈ ప్రయోగంలో వ్యోగగాములతో పాటు ఎనిమిదేళ్ల చిన్నారి తయారుచేసిన ఓ బొమ్మ కూడా చంద్రుని చెంతకు చేరనుంది. వ్యోమగాములతో పాటు వెళ్లే ఈ బొమ్మను 8 ఏళ్ల అంతరిక్ష ఔత్సాహికుడైన లూకాస యే అనే ఎనిమిదేళ్ల బాలుడు తయారుచేశాడు. దానికి రైజ్ అని పేరు పెట్టాడా బుడతడు. రైజ్.. చూడ్డానికి ఓ సాధారణ బొమ్మలా కనిపిస్తున్నప్పటికీ జాబిల్లిపై అది కీలకపాత్రను పోషించనుంది. వ్యోమగాములు భూమి గురుత్వాకర్షణను దాటి ఎప్పుడు వెళ్లారో కచ్చితంగా సంకేతం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా చిన్నారులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే ఉద్దేశంతో నాసా ఈ బొమ్మను ఎంపిక చేసింది. ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా మొత్తం నలుగురు వ్యోమగాములు చంద్రుడి క్షక్ష్యలోకి వెళ్లనున్నారు. సుమారు పది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వారు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి, భవిష్యత్తులో మానవ నివాసానికి గల అవకాశాలను పరిశీలించనున్నారు. ఓరియన్ నౌక ద్వారా సాగే ఈ ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ప్రయోగానికి ముందు వ్యోమగామి జెరెమీ హాన్సెన్ ఏం చెప్పారంటే.. “మేం సమస్త మానవాళి కోసం వెళుతున్నాం” అన్నారు. ఆర్టెమిస్ లాంచ్ డైరెక్టర్ చార్లీ బ్లాక్‌వెల్-థాంప్సన్ వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యాత్ర నూతన తరం ఆశలు, కలలను మోసుకెళ్తోందని కామెంట్ చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్స్ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
కిరాణా వ్యాపారికి ఫోన్ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే