పొల్యూషన్ కి భయపడి బయటకు వెళ్లట్లేదు, వాకింగూ మానేశా

Updated on: Nov 27, 2025 | 6:42 PM

ఢిల్లీ వాయు కాలుష్యంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. కాలుష్యం భయంతో తాను వాకింగ్ కూడా మానేశానని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 1న కేసు విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని సీజేఐ పేర్కొన్నారు.

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “పొల్యూషన్ కి భయపడి బయటకు వెళ్లట్లేదు, వాకింగూ మానేశా” అని ఆయన వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు, డిసెంబర్ 1న ఢిల్లీ వాయు కాలుష్యంపై అత్యవసరంగా విచారణ చేపడతామని సీజేఐ, జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కాలుష్య సమస్య అందరికీ తెలుసునని, దీనికి కారణాలను గుర్తించి తగిన పరిష్కారాలు కనుగొనాలని సీజేఐ సూచించారు. భారీ పొగమంచుకు దారితీస్తున్న అంశాలను సమగ్రంగా అంచనా వేయడంలో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏయే కమిటీలను ఏర్పాటు చేసిందో తెలపాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

Follow Us