NTR District: ఉదయం గ్యాస్ సమస్య అంటూ ట్యాబ్లెట్ వేసుకుంది.. సాయంత్రం కాలేజ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా

Updated on: Sep 16, 2025 | 8:13 PM

నందిగామలోని ఓ కళాశాల విద్యార్థిని మాగం నాగమణి, తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై కుప్పకూలి మరణించింది. క్షణాల్లో సంభవించిన ఈ గుండెపోటు ఘటన స్థానికులను కలచివేసింది. యువతి ఆరోగ్యంగానే ఉండేదని, ఉదయం గ్యాస్‌ సమస్యకు మాత్ర వేసుకుందని ఆమె స్నేహితులు తెలిపారు. 

నందిగామలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి అనే విద్యార్థిని సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కాలేజీ నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఆమె స్నేహితురాలు, స్థానికుల సహాయంతో ఆమెను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. నాగమణికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో చలాకిగా ఉండేదని ఆమె స్నేహితులు, అధ్యాపకులు తెలిపారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.