ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!

Updated on: Jul 04, 2026 | 4:59 PM

బలమైన తొడల కండరాలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్క్వాట్స్, లాంజెస్ వంటి వ్యాయామాలను వారానికి రెండు నుంచి మూడు రోజులు చేయడం, ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం, నడక, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను అలవాటు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఎక్కువ రోజులు ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించాలంటే కేవలం గుండె, మెదడు ఫిట్‌గా ఉంటే సరిపోదట.. తొడల కండరాలు కూడా ఎంతో బలంగా ఉండాలని పోషకాహార, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బలమైన తొడలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం దగ్గరి నుంచి గుండె, మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు అనేక అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయని వారు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. మానవ శరీరంలోనే అత్యంత పెద్ద కండరాలు తొడలలో ఉంటాయి. ఇవి ఎంత బలంగా ఉంటే, రక్తంలోని గ్లూకోజ్‌ను అంత ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉండటమే కాకుండా, ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, బలమైన కాళ్ల కండరాలు జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. కాళ్ల నుంచి గుండె వైపు రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా దోహదం చేస్తూ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ వారానికి కనీసం రెండు నుంచి మూడు రోజులు స్క్వాట్స్, లాంజెస్, కాఫ్ రైజెస్, డెడ్‌లిఫ్ట్స్ వంటి కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు క్రమం తప్పకుండా నడక, సైక్లింగ్, రన్నింగ్ చేయడంతో పాటు.. ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం ఎంతో అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!

Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Follow Us