Sachin Tendulkar: మాట నిలబెట్టుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

Updated on: Dec 12, 2025 | 7:22 PM

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల క్రితం తన సహచరుడు గురుశరణ్ సింగ్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇరానీ కప్‌లో గురుశరణ్ మద్దతుతో సెంచరీ చేసి భారత జట్టుకు ఎంపికైన సచిన్, అతని బెనిఫిట్ మ్యాచ్ ఆడతానని హామీ ఇచ్చారు. గురుశరణ్ సహాయానికి కృతజ్ఞతగా, సచిన్ తన వాగ్దానాన్ని నెరవేర్చిన తీరు వ్యక్తిత్వానికి నిదర్శనం.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం ఆటతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నాడు. తన మాజీ సహచరుడు గురుశరణ్ సింగ్‌కు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో వివరించారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు తాను 85 పరుగుల వద్ద ఉన్నానని, అప్పటికే 9 వికెట్లు పడిపోయాయని, జట్టు వైస్ కెప్టెన్ అయిన గురుశరణ్ సింగ్ చేయి విరగడంతో బ్యాటింగ్ చేసే స్థితిలో లేరని చెప్పారు. కానీ, రాజ్ సింగ్ దుంగార్పూర్ సూచనతో అతను విరిగిన చేత్తోనే బ్యాటింగ్‌కు వచ్చారని తెలిపారు. అతని మద్దతుతో లీను సెంచరీ పూర్తి చేశానని, ఆ సెంచరీ వల్లే తాను భారత జట్టుకు ఎంపికయ్యానని సచిన్ వెల్లడించారు. ఆ రోజు గురుశరణ్ చూపిన చొరవ, అతని వైఖరి తన హృదయాన్ని తాకిందని సచిన్ వివరించారు. అతను చేసిన సాయానికి తాను ఎంతగానో కృతజ్ఞతలు తెలిపానని, ఆ సమయంలోనే న్యూజిలాండ్‌లో అతనికి ఒక మాట ఇచ్చానని చెప్పారు. ‘గుషీ, ఎప్పటికైనా నువ్వు రిటైర్ అయ్యాక నీ బెనిఫిట్ మ్యాచ్ జరిగితే, నేను తప్పకుండా వచ్చి ఆడతాను’ అని హామీ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత గురుశరణ్ తన బెనిఫిట్ మ్యాచ్ కోసం ఫోన్ చేయగా, సచిన్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఫోన్‌లో “నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఆడతావా అని అడిగాడని, తాను వెంటనే, ‘తప్పకుండా వస్తాను, అది నా బాధ్యత’ అని చెప్పి ఆ మ్యాచ్ ఆడానని తెలిపారు. ఈ జ్ఞాపకాలు తనతో ఎప్పటికీ ఉంటాయన్న సచిన్‌, తాను ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు ఈ రోజు గర్వంగా ఉందని సచిన్ చిరునవ్వుతో వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేపే మెస్సీ Vs సీఎం రేవంత్ ఫుట్​బాల్ మ్యాచ్

భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..

Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా