భారీ సెంచరీ చేసి సహచరుడిని కొట్టబోయిన పృథ్వీషా
టీమిండియా యంగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ వివాదాల్లో నిలిచే ఈ ఆటగాడు ఈ సారి గ్రౌండ్‌లోనే గొడవకు దిగి సంచలనంగా మారాడు. మహారాష్ట్ర - ముంబై వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తో పృథ్వీ షా గొడవ పడడం గ్రౌండ్‌లోనే హై టెన్షన్ సృష్టించింది. షా అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ఈ వాగ్వాదం చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోను పరిశీలిస్తే.. ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్, పృథ్వీ షాకు మధ్య గొడవ అయినట్లు తెలుస్తోంది. అంపైర్లు జోక్యం చేసుకునే ముందు షా తన బ్యాట్ ను చూపిస్తూ బెదిరించాడు. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు మధ్యలో జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ముంబైతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీ షా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 140 బంతుల్లోనే 186 పరుగులు పూర్తి చేసి, తన పాత జట్టు బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 305 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముంబైని వీడి మహారాష్ట్రకు మారిన తర్వాత తొలిసారి ముంబైతో తలపడిన షా, తన ఫామ్ తిరిగి వచ్చిందనే బలమైన సంకేతాన్ని బీసీసీఐ సెలెక్టర్లకు పంపాడు. ‘తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని, టీమిండియాలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని’ ఈ సెంచరీ ద్వారా షా గట్టిగా చెప్పినట్లయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు
మొదలైన క్రిస్మస్ సినిమాల భారీ పోటీ.. గెలిచేది ఆ స్టార్ హీరోనేనా ??
ఆ భామ జాతకం మారేదేలే.. హిట్ కొట్టేదెలే.. పాపం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఏంటి
