Viral Video: ఐపీఎల్ 2021లో భాగంగా నిన్న డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ టీంలు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా ఆడిన ఓ షాట్‌తో బౌండరీ బయట ఉన్న కెమెరా గ్లాస్ పగిలిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన పుల్ షాట్ కొట్టాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ వద్దకు వెళ్లి ట్రాలీపై కదులుతున్న కెమెరాను బలంగా తాకింది. దీంతో ఆ కెమెరా గ్లాస్ పగిలిపోయింది.
ఈ సమయంలో బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రషీద్ ఖాన్ నవ్వడం ప్రారంభించాడు. కెమెరా విరిగిపోయిందని వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నితీష్ రాణా ఆడిన ఈ షాట్ కేకేఆర్ బృందానికి చాలా ముఖ్యమైనది.
రానా 33 బంతుల్లో 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో రానా మొత్తం 3 ఫోర్లు కొట్టాడు. ఇందులో ఈ ఫోర్ కూడా ఒకటి. నితీష్ ఇన్నింగ్స్ కేకేఆర్ జట్టు విజయానికి ఎంతో సహాయపడింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 12 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.
రాయుడు ధాటికి రిఫ్రిజిరేటర్ అద్దాలు..
అంతకుముందు అంట మొదటి దశలో చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్‌లో అంబటి రాయుడు ఆఫ్-సైడ్‌లో సిక్స్ కొట్టాడు. అది డగౌట్లో ఉంచిన రిఫ్రిజిరేటర్‌కి నేరుగా వెళ్లి తాకింది. దీంతో రిఫ్రిజిరేటర్ అద్దాలు పగిలిపోయాయి.