Pandya-Pollard family: పొలార్డ్ ఫ్యామిలీతో పాండ్యా.. ట్రీట్‌ అదిరిపోయిందంటూ ట్వీట్‌.! వైరల్ అవుతున్న వీడియో..

|

Aug 15, 2022 | 9:37 PM

కరేబియన్‌ దీవులంటేనే సుందరమైన బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ వాలిపోతుంటారు చాలామంది. ఇదిలా ఉంటే ఇప్పుడు భారత క్రికెట్‌ జట్టు విండీస్‌ పర్యటనలో ఉంది.


కరేబియన్‌ దీవులంటేనే సుందరమైన బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలకు నెలవు. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ వాలిపోతుంటారు చాలామంది. ఇదిలా ఉంటే ఇప్పుడు భారత క్రికెట్‌ జట్టు విండీస్‌ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. కాగా నాలుగో టీ20 కి నాలుగు రోజుల గ్యాప్‌ రావడంలో స్టార్‌ ఆల్‌రైండర్‌ హార్ధిక్‌ పాండ్యా మాత్రం తన ముంబై ఇండియన్స్‌ టీమ్‌ మేట్‌ , తనెంతో అభిమానించే విండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఇంటికి వెళ్లాడు. అతని కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపాడు.కాగా విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. ఈక్రమంలోనే విండీస్‌ పర్యటనను ముగించుకునేముందు పొలార్డ్‌ ఇంటికెళ్లాడు హార్దిక్‌. వారి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘కింగ్‌ పొలార్డ్‌ ఆతిథ్యం స్వీకరించకుండా కరేబియన్‌ పర్యటన ముగియదు. పొలార్డ్‌ అంటే నాకు ఎంతో అభిమానం. అన్నతో సమానం. మాకు అదిరపోయే ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 15, 2022 09:37 PM