అమ్మాయిగా మారిన క్రికెటర్ !! ప్రస్తుతం తన పరిస్థితి ??

Updated on: Nov 13, 2024 | 9:58 PM

భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు. ఆర్యన్ బంగర్ తన పేరును అనయ బంగర్ గా మార్చుకున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా తీసుకున్నాడు. తన 10 నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.

ఇందులో భాగంగా తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పాడు. తన నిర్ణయంతో చాలా సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా.. అనయ శారీరకంగా బలాన్ని కోల్పోయి సంతోషంతో ఉన్నాననీ తెలిపింది. తాను వేసే ప్రతీ అడుగు తనకు బాగా నచ్చుతోందనీ తన శరీరం పూర్తిగా మారిపోయి తనలోని అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుతోందని చెప్పుకొచ్చింది. ఆర్యన్ బంగర్ చిన్నప్పటి నుంచి తన తండ్రిలాగే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఎంతో ప్రాక్టీస్ చేసిన అతను లండన్‌లోని లీసెస్టర్‌షైర్‌ హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. ఆర్యన్‌ తండ్రి 51 ఏళ్ల సంజయ్ బంగర్ 2001-2004 మధ్య కాలంలో భారత్​ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రవిశాస్త్రి టీమ్​ఇండియాకి డైరెక్టర్​గా ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు జాతీయ జట్టు కు బ్యాటింగ్​ కోచ్ గా కూడా పనిచేశారు. 2021 ఐపీఎల్ సీజన్ లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్ జట్టు​కు బ్యాటింగ్​ సలహాదారుగా ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రలోకి జారుకోవడానికి మిలిటరీ టెక్నిక్‌ !!

లారీ కింద ఇరుక్కున్న యువతి.. జాకీలు తెప్పించి రక్షించిన బండి సంజయ్‌

సమాధుల కింద హెజ్‌బొల్లా భారీ టన్నెల్‌ !!

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి

యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!

 

Published on: Nov 13, 2024 09:56 PM
Loading...
Unable to load recommendations.
Follow Us