మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్..మ్యాచ్ ఫీజులు డబుల్ ధమాకా వీడియో

Updated on: Dec 25, 2025 | 6:10 PM

బీసీసీఐ దేశవాళీ మహిళా క్రికెటర్లకు భారీ శుభవార్త ప్రకటించింది. పురుష క్రికెటర్లతో సమానమైన వేతనాలు, గౌరవం కల్పించాలనే లక్ష్యంతో మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచింది. సీనియర్ ప్లేయర్ల ఫీజు రూ.20,000 నుండి రూ.50,000-60,000కు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.10,000 నుండి రూ.25,000కు చేరింది. ఈ నిర్ణయంతో మహిళా క్రికెటర్లకు మంచి ఆర్థిక భరోసా లభించనుంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానమైన గౌరవం, వేతనం కల్పించాలనే లక్ష్యంతో మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇటీవల భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో, ఆ విజయానికి గుర్తింపుగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, సీనియర్ మహిళా దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడే ప్లేయర్లకు ప్రతిరోజూ 50,000 నుండి 60,000 రూపాయలు అందుతాయి. గతంలో ఇది కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో