బీసీసీఐ ముందు తలవంచిన పీసీబీ చీఫ్

Updated on: Oct 02, 2025 | 4:42 PM

ఆసియా కప్ ముగిసి మూడు రోజులు గడిచినా దాని చుట్టూ ఉన్న ముసిరిన వివాదాలు ఇంకా సద్దుమణగడం లేదు. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి మన భారత జట్టు తొమ్మిదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. కానీ, మ్యాచ్ తర్వాత బహుమతి ఇచ్చే సమయంలో జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానలా మారింది. ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అయిన మొహసిన్ నఖ్వీ ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా నిలిచారు.

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం సాగుతుండగానే, సెప్టెంబర్ 30న ACC సమావేశం జరిగింది. ఈ భేటీలో “వెస్టిండీస్‌పై విజయం సాధించినందుకు నేపాల్‌ను మీరు అభినందించారు, కానీ ఆసియా కప్ గెలిచినందుకు భారతదేశాన్ని అభినందించలేదు?” అని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్‌ను ఆశిష్ షెలార్ నిలదీశారు. దీంతో, మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. భారత్ కు క్షమాపణలు చెప్పిన ఆయన.. తాజాగా ట్రోఫీ విషయంలో కూడా వెనక్కి తగ్గారు. ఇక.. ఆసియా కప్ ఫైనల్స్ తర్వాత.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించడంతో, ఆ కప్‌ను ఆయన తనతోనే ఉంచుకున్నారు. దీంతో, ఆయనపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ ట్రోఫీ నఖ్వీ దగ్గర లేదని, ఆయన లాహోర్ వెళ్లే ముందు దుబాయ్‌లో ఆసియా కప్ ట్రోఫీ, పతకాలను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే.. యూఏఈ బోర్డు భద్రతలో ఉన్న ఆ ట్రోఫీ..భారత్‌కు ఎప్పుడు, ఎలా చేరుతుందనేది ప్రశ్నగా మారింది. ట్రోఫీని బీసీసీఐ హెడ్డాఫీసుకు పంపటం లేదా దుబాయ్‌లో భారత ప్రతినిధి తీసుకోవటం గానీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ లో పలు వివాదాలు కొనసాగాయి. తొలుత జరిగిన మ్యాచ్‌లలో గెలుపు తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఎవరూ.. పాక్ టీంకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూంకి వచ్చారు. ఇది మాజీ ఆటగాళ్ళు, టీవీ నిపుణులు, సామాన్యుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. తర్వాత.. ఫైనల్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించినప్పుడూ ఇదే జరిగింది. అంతేగాక.. ట్రోఫీ డ్రామా మొదలైంది. భారత జట్టు మొదట ఐక్యతతో వ్యవహరించినప్పటికీ, పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో టీమిండియాను రెచ్చగొట్టేలా చెడ్డ చేష్టలు చేశారు. దీనికి గాను ఆటగాళ్లకు జరిమానాలు కూడా విధించారు. ఫైనల్ రాత్రి కెప్టెన్‌లను ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడం వంటివి ఈ ఉద్రిక్తతను మరింత పెంచాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా సెనెట్ లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు

ఆందోళనకారులపై పాక్ సాయుధ బలగాల కాల్పులు

Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్‌ కపూర్‌

Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్

మళ్లీ మొదలైన యానిమేటెడ్‌ మూవీస్‌ ట్రెండ్‌