Sonam Wangchuk: లడఖ్‌ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ అరెస్ట్‌

Updated on: Sep 26, 2025 | 8:43 PM

లడఖ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లడఖ్‌లో అల్లర్లకు కారకుడిగా కేంద్రం ఆరోపిస్తోంది. జాతీయ భద్రతా చట్టం కింద లేహ్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయన ఎన్జీఓ విదేశీ నిధులపై సీబీఐ విచారణ చేపట్టింది. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు తనపై అణచివేతకు పాల్పడుతున్నారని వాంగ్‌చుక్‌ ఆరోపించారు.

లడఖ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను లేహ్ పోలీసులు అరెస్టు చేశారు. లడఖ్‌లో జరిగిన అల్లర్లకు, నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఆందోళనలకు సోనమ్‌ వాంగ్‌చుక్‌ కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆందోళనకారులను వాంగ్‌చుక్‌ రెచ్చగొట్టినట్లు కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో, జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను అరెస్టు చేశారు. ఈ పరిణామాల మధ్య, సోనమ్‌ వాంగ్‌చుక్‌కు చెందిన ఎన్జీఓ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ (హెచ్‌ఐఏఎల్‌) విదేశీ నిధులపై సీబీఐ విచారణ చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఇప్పటికే హెచ్‌ఐఏఎల్‌ ఫారిన్ ఫండింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. విదేశీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి. గత ఆగస్టులో, లడఖ్‌ ప్రభుత్వం హెచ్‌ఐఏఎల్‌కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసింది. కేటాయించిన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో సంస్థ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ హైకోర్టులో OG టికెట్ రేట్లపై వాదనలు

Jal Prahar-25: కాకినాడ తీరంలో జల్ ప్రహార్ 2025 విన్యాసాలు

మిగ్ 21 యుద్ధ విమానాలకు తుది వీడ్కోలు

ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు

టిక్కెట్ల పెంపు అనేది OG సమస్య కాదు.. ఇండస్ట్రీ సమస్య