అత్తతో సంబంధం.. మేనమామను హత్యచేసిన మేనల్లుడు చివరకు వీడియో
వావివరుసలు మరిచి పశువుల్లా వివాహేతర సంబంధాలు నెరుపుతూ సభ్య సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. అయిన వారని కూడా చూడకుండా వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న వారిని అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. తాజాగా, విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాంలో దారుణ హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విశాఖపట్నం సిటీ గోపాలపట్నం నివాసి.. నారపాటి సాయి అనే యువకుడు పాత నేరస్తుడు. అతడిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. తమ కొడుకు అక్కడే ఉంటే.. మరింత చెడిపోతాడనే ఉద్దేశంతో సాయి తల్లిదండ్రులు.. కెరటాంలోని మేనమామ నిడిగెట్టి కృష్ణ ఇంటికి పంపారు. అలా రెండేళ్ల నుంచి అతడు అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మేనమామ భార్యతో.. చనువుగా ఉంటున్నాడు. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న కృష్ణ.. మేనల్లుడిని విశాఖ వెళ్లిపోవాలని చెప్పేశాడు. అంతేగాక.. మేనల్లుడు తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామంలోని కొందరికి చెప్పాడు. దీంతో, ఆగ్రహించిన సాయి… తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మేనమామను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 9న మద్యం తాగుదామని నమ్మించి మేనమామను నమ్మించి ఊరిబయటికి తీసుకుపోయాడు. బాగా తాగించి, కృష్ణ మద్యం మత్తులో ఉండగా, గొంతునులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చి.. మామయ్యకు మందు ఎక్కువై పడిపోయాడని నమ్మబలికి.. మేనమామ కొడుకు జస్వంత్‌ను తీసుకుని మద్యం సేవించిన చోటికి తీసుకుపోయాడు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!