అతిగా స్మార్ట్‌ఫోన్ చూస్తే.. అంతే సంగతులు

Updated on: Oct 18, 2025 | 6:46 PM

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి జీవించలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్ర లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు దీనిని వాడుతునే ఉంటారు. సాటి మనుషులతో కంటే కూడా సెల్ ఫోన్లతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. బోజనం చేస్తున్నా, వాష్ రూంకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఫోన్ కంపల్సరిగా ఉండాల్సిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు.

అయితే స్మార్ట్‌ ఫోన్‌ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అధికంగా ఉపయోగిస్తే అన్ని నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా సైకాలజీ అసోసియేషన్‌ నిర్వహించిన ఓ తాజా సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాము సెట్ చేసుకున్న నోటిఫికేషన్ రాకున్నా.. పదేపదే మొబైల్ ఫోన్ తీసి చూడటం యువతకు అలవాటుగా మారిందని, దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైండ్ కేవలం సెల్ ఫోన్ మీద తప్ప మరే ఇతర పని మీద పూర్తి స్థాయిలో నిమగ్నం కావటం లేదని, దీనివల్ల మెదడులో చురుకుతనం తగ్గిపోతుందని గుర్తించారు. ప్రతి ఒక్క విషయానికి స్మార్ట్ ఫోన్లపై ఆధారపడడం వల్ల మనిషిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని సర్వేలో బయటపడింది. సోషల్ మీడియాలో ప్రతికూల వార్తలను, పోస్టులను అదే పనిగా గంటల తరబడి చూడడం వల్ల మనసు దానివైపే పోతుందని, ఆ నెగటివ్‌ వార్తను తమకు అన్వయించుకుని చాలామంది ఆందోళన చెందుతున్నారని ఆ సర్వే వెల్లడించింది. కాలక్రమంలో ఇది ఒక వ్యసనంలా మారి, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.ప్రతికూల వార్తలు కుంగుబాటుకు దారితీస్తాయని, కొందరిలో గుండె దడ, భయాందోళనలను కలిగిస్తాయని తెలిపింది. చిన్న విషయాలకు అతిగా ఆలోచించి, అకారణంగా కంగారు పడటం వల్ల కాలక్రమంలో నిద్రలేమి, ఒత్తిడితో కారణమవుతుందని ఆ నివేదిక వెల్లడించింది. అతిగా మొబైల్ వాడటం వల్ల తలనొప్పి, భుజం, మెడ నొప్పి సమస్యలు వస్తాయి. ఆకలివేయడం తగ్గుతుంది. శరీరం కూడా తొందరగా అలసిపోయిన భావన కలుగుతుంది. ల్యాప్‌టాప్‌, సెల్​ఫోన్​ల ముందు ఎక్కువ టైం గడపడం వల్ల కంటి సమస్యలూ వస్తాయి. తమకు తెలియకుండానే కొన్ని గంటల కొద్దీ టైం వృథా చేసుకుంటుంటారు. ఇది గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరుగుతుందని అమెరికా సైకాలజీ అసోసియేషన్‌ అధ్యయనం పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే

K- Ramp: కే ర్యాంప్‌ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం.. అబ్బా అనిపించాడా ?? తెలియాలంటే వీడియో చూసేయండి

పిల్లలకు పేర్లు పెడుతూ కోట్ల సంపాదన.. ఒక్కో పేరుకు రూ. 27 లక్షలు

త్వరలో వందే భారత్ 4.0.. గంటకు 320 కి.మీ స్పీడ్‌