ఏకంగా ప్రాణాలు తీసేంత ప్రమాదకకరమా అనే చర్చలు మొదలైంది. అసలు మోమోస్‌లను ఎలా తయారు చేస్తారు? వాటిలో ఏమేమి పదార్థాలు వాడతారు అనే ప్రశ్నలతో సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమోస్‌ను తిన్న సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం అనే మహిళ మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. బస్తీలోని సుమారు 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక కొద్ది రోజుల క్రితం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో ఉన్న గ్రిల్ హౌస్‌లో షవర్మా తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వీటన్నింటికి ఫుడ్ పాయిజనే కారణం. అయితే షవర్మా లేదా మోమోస్ వల్ల వాళ్లకు ఫుడ్ పాయిజన్ కాలేదంటున్నారు ఆహార నిపుణులు. వాటిలో వాడే చట్నీ, మయోనైజ్ ఈ ప్రమాదాలకు కారణమంటున్నారు. మయోనైజ్‌ను.. కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, మండి బిర్యానీ, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఫుడ్స్‌లో చెట్నీలా నంజుకు తింటారు. అసలు ఏంటి ఈ మయోనైజ్ ? అది ఎందుకంత డేంజర్‌గా మారుతోంది. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. గుడ్డులోని పచ్చసొన, 2 టేబుల్ స్పూన్లు వెనిగర్, లేదా నిమ్మరసం.. 1 టేబుల్ స్పూన్ డిజోన్ ఆవాలు, హాఫ్ టీస్పూన్ ఉప్పు, హాఫ్ టీస్పూన్ తెల్ల మిరియాలు, 2 కప్పుల వంట నూనె, ఉప్పు… వీటన్నింటిని బ్లెండ్ చేసి మిక్సీలో వేసి దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది రా ఫుడ్. అంటే ఎక్కువసేపు నిల్వ ఉండదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
Aha OTT: గుడ్ న్యూస్.. ఆహాలో త్వరలో చిరంజీవ
KA: కిరణ్ అబ్బవరం “క” మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
TOP 9 ET News: ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్