Watch: కాశీ వెళ్లొచ్చేలోగా భారీ చోరీ.. కేజీన్నర బంగారం, 8 కేజీల వెండి అపహరణ

Edited By:

Updated on: Jun 30, 2026 | 6:59 PM

Siddipet Crime News: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చింత రాజకుమార్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి కాశీ యాత్రకు వెళ్లగా, దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్‌ను ధ్వంసం చేసి కిలోన్నర బంగారం, ఎనిమిది కిలోల వెండి, ఎనిమిది లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చింత రాజకుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కాశీ యాత్రకు వెళ్లగా, దొంగలు వారి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, బీరువా లాకర్‌ను ధ్వంసం చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు, ఎనిమిది కిలోల వెండితో పాటు ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాశీ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చేలోపే ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ భారీ చోరీ ఘటన దుబ్బాకలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us