Rain Effect: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..

|

May 08, 2024 | 8:42 AM

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు. నిన్న మొన్నటి వరకు మాడు పగిలే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం. అయితే ఉపశమనంతో పాటు ఘోర ప్రమాదాన్ని కూడా వెంటపెట్టుకువచ్చింది. బాచుపల్లిలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు.

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు. నిన్న మొన్నటి వరకు మాడు పగిలే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం. అయితే ఉపశమనంతో పాటు ఘోర ప్రమాదాన్ని కూడా వెంటపెట్టుకువచ్చింది. బాచుపల్లిలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఆరిజన్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిహెచ్‌ఎంసి, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శిధిలాల నుంచి ఏడుగురు మృతదేహాలను తీసిన పోలీసులు డెడ్‌బాడీలను పోస్టు మార్టంకు తరలిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 08, 2024 08:33 AM