Scrub Typhus: చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

Updated on: Dec 05, 2025 | 9:49 AM

చిన్న కీటకం. నల్లిని పోలి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే వణికిస్తోంది. దాని పేరే స్క్రబ్ టైఫస్. దీని లక్షణాలను చూస్తే.. ఇది కుట్టిన వెంటనే.. అక్కడ నల్లని మచ్చ వస్తుంది. ఆ వ్యక్తి శరీరంలోకి బ్యాక్టీరియా వెళుతుంది. వారం, పది రోజుల్లోపే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు.. ఎక్కువగా వస్తాయి. మామూలు జ్వరం, తలనొప్పి అని వీటిని తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాటి తీవ్రత అంతలా ఉంటుంది.

చిన్న కీటకం. నల్లిని పోలి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే వణికిస్తోంది. దాని పేరే స్క్రబ్ టైఫస్. దీని లక్షణాలను చూస్తే.. ఇది కుట్టిన వెంటనే.. అక్కడ నల్లని మచ్చ వస్తుంది. ఆ వ్యక్తి శరీరంలోకి బ్యాక్టీరియా వెళుతుంది. వారం, పది రోజుల్లోపే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు.. ఎక్కువగా వస్తాయి. మామూలు జ్వరం, తలనొప్పి అని వీటిని తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాటి తీవ్రత అంతలా ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే.. శరీరమంతా నల్లటి మచ్చలు వస్తాయి. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మెదడు పైనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ ఉన్న.. చిగ్గర్ మైట్ కుడితే వచ్చే ఈ లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో గుర్తిస్తే.. 5 రోజుల చికిత్సతో బయటపడవచ్చు. మరిప్పుడు ఇది ఎందుకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది?

ఇది రికెట్సియా ఫ్యామిలీకి చెందింది. ఆ కుటుంబానికి చెందిన.. ఓరియంటియా సుట్సుగముషి.. అనే సూక్ష్మజీవి వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అసలు దీని మూలాలేంటి? ఒక్కసారి ఈ డీటైల్స్ కూడా చూద్దాం. ఇది 19వ శతాబ్దం చివరి కాలంలో తూర్పు ఆసియాలో బయటపడింది. అప్పట్లో జపాన్ లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇంకా చెప్పాలంటే.. 1870-1900 మధ్య కాలంలో జపాన్ లోని గ్రామీణ ప్రాంతాలు, అక్కడి సైనికుల్లో ఇది కనిపించింది. ఇది కుడితే జ్వరం ఓ రేంజ్ లో వస్తుంది. అందుకే దీనిని మొండి జ్వరంగానే తొలుత భావించారు. పరిశోధనలు చేసిన తరువాత.. అది స్క్రబ్ టైఫస్ అని తేలింది. అలా 1920లో జపాన్ శాస్త్రవేత్తలు.. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చెక్ చేయగా.. అది చిగ్గర్ మైట్ అనే సూక్ష్మజీవి కుడితే వస్తుందని సైంటిఫిక్ గా తేల్చారు.

Published on: Dec 05, 2025 09:46 AM