ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

Updated on: Oct 27, 2025 | 8:08 PM

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌... ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. తమ వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో.. రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

ఈ ఏడాది జూన్ నాటికే 505 పీవో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు అవసరాల మేరకు ఆఫీసర్లు, క్లరికల్ కేడర్‌లలో కలిపి మొత్తం 18,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగానే తాజాగా పీవో నియామకాలు చేపట్టారు. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఐటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడంపై కూడా ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,300 మంది నిపుణులను నియమించినట్టు తెలుస్తోంది. తాజా నియామకాలతో బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ

అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది

Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌