అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్

Updated on: Jul 11, 2025 | 11:31 AM

తానా 24వ మహాసభలు మూడో రోజు సైతం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సామ్ మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను ఏటా తానా గురించి వింటూనే ఉన్నానని, తొలి చిత్రం ఏ మాయ చేశావే రిలీజ్ రోజు నుంచి తనను తెలుగు సమాజం కలిపేసుకుందని ధన్యవాదాలు తెలిపారు. తాను ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు.. తెలుగు వారు ఏమనుకుంటారు ? అని ఆలోచించేంతగా తాను తెలుగు సమాజంతో మమేకమయ్యానని అన్నారు.

ఈ క్రమంలో వేదికపై మాట్లాడుతూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. సమంత మాట్లాడుతూ.. “ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ఏటా తానా గురించి వింటూనే ఉంటాను. నా మొదటి సినిమా ఏ మాయ చేసావే నుంచి ఇప్పటి వరకు ఎప్పడూ ఈ వేదిక నుంచి మాట్లాడే అవకాశం రాలేదు. కానీ, తెలుగు వారు మాత్రం నన్ను మీలో ఒకరిగా అనుకుంటూనే వచ్చారు. మీప్రేమను నాకు పంచిన మీకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు సొంతిల్లు తెలుగు. ‘ఓ బేబీ’ మూవీతో మిలియన్ డాలర్లు వస్తే నమ్మలేకపోయాను. అదంతా మీ ప్రేమ. మీరు దూరంగా ఉన్నా.. నా మనసుకు దగ్గరగానే ఉన్నారు. మీకు కృతజ్ఞురాలిని”అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో