Apsara Murder: చర్లపల్లి జైలుకు పూజారి సాయికృష్ణ తరలింపు.. ఇంకా వీడని మిస్టరీ.. వీడియో.

|

Jun 10, 2023 | 7:05 PM

శంషాబాద్‌ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలయంలో పూజలు చేసే ఓ పూజారి మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

శంషాబాద్‌ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలయంలో పూజలు చేసే ఓ పూజారి మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం అప్సర మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురిలో ఉంచారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ని విధించింది. ఇదిలా ఉంటే అప్సర హత్య కేసులో తన భర్తను కావాలనే ఇరికిచ్చారని సాయికృష్ణ భార్య శ్రావ్య ఆరోపించారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..’అప్సర హత్య యాక్సిడెంటల్‌గా జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయి టార్చర్‌ వల్లే ఈ ఘటన జరిగింది. నా భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదు. అప్సరతో మాట్లాడతాడు కాని రిలేషన్‌ లేదు. అప్సర గర్భం సాయికృష్ణ వల్ల రాకపోయి ఉండొచ్చు. మా ఇంట్లో పూజకు కూడా అప్సర వచ్చింది. అప్పుడప్పుడు లేట్‌నైట్‌ వస్తుంటారు, అది పనిలోనే వెళ్తారు’ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.