Watch Video: కుంగిన రైల్వే బ్రిడ్జ్.. తెగిపోయిన విద్యుత్ వైర్లు.. ఏం జరిగిందంటే..
విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్‌లో కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను వాల్తేరు రైల్వే DRM సౌరబ్ ప్రసాద్ పరిశీలించారు. 3,4 ప్లాట్ ఫార్మ్స్ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో మూడో నెంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు కేవలం పాసింజర్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. రేపటికల్లా ఎఫ్‌వోబీ అందుబాటులోకి వస్తుందన్నారు వాల్తేరు రైల్వే DRM సౌరబ్ ప్రసాద్.

ఈ ఉదయం విశాఖ రైల్వేస్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత భాగం ఒరిగిపోయింది. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్‌ఫాంపైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ వెంటనే స్పందించిన రైల్వే అధికారులు వైర్లను సరిచేయగా.. రైలు కదిలి వెళ్లిపోయింది. మరోవైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టారు. రేపటికల్లా ఎఫ్‌వోబీ అందుబాటులోకి వస్తుందన్నారు DRM సౌరబ్ ప్రసాద్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..