సినీ నటుడు మోహన్ బాబు తన గన్ పోలీసులకు సరెండర్ చేశారు. మంచు మనోజ్ వివాదం నేపథ్యంలో గన్స్ సరెండర్ చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు.. నటుడు మోహన్ బాబును ఆదేశించడం తెలిసిందే. దీంతో మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు తన గన్ సరెండర్ చేశారు. పోలీసులు మోహన్ బాబు గన్ను తీసుకెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.