ఈ ఏడాది ట్రావెన్‌కోర్ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?
శబరిమలలో మకరవిళక్కు ఉత్సవం ముగియడంతో అయ్యప్ప దర్శనభాగ్యం తాత్కాలికంగా ముగిసింది. జనవరి 19న ఆలయం మూసివేయబడి, తొమ్మిది నెలల పాటు భక్తులకు విరామం లభిస్తుంది. ఈ ఏడాది 52 లక్షల మంది భక్తులు సందర్శించగా, ₹435 కోట్ల రికార్డు ఆదాయం వచ్చింది. నెలవారీ, పండుగల పూజల కోసం మధ్యలో ఆలయం తెరుస్తారు. అయ్యప్ప దీక్షకు ఈ ఏడాదికి పరిసమాప్తి.
శబరిమలలో రేపటి నుంచి అంతా నిశ్శబ్దం. శరణఘోషకు ఇక 9 నెలల పాటు విరామం. జనవరి 19 సోమవారంతో శబరిమలలో భక్తులకు దర్శనభాగ్యం పరిసమాప్తి అవుతుంది. ఆనవాయితీ ప్రకారం మంగళవారం నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. స్వామియే శరణం అయ్యప్ప..నిన్నటిదాక శబరిమల పరిసరాలు భక్తుల శరణు ఘోషతో హోరత్తాయి .మకర జ్యోతి సందర్భంగా శబరిమల భక్తజనసంద్రాన్ని తలపించింది. మకర విళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. జనవరి 19 సోమవారం సాయంత్రం వరకు మాత్రమే భక్తులకు హరిహరసుతుడి దర్శన భాగ్యం లభిస్తుంది. అథాళ పూజ అనంతరం రాత్రి పది గంటల తరువాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు. ఏడాదికి ఏడాది శబరిమలకు భక్తుల సంఖ్యతో పాటు ట్రావెన్‌కోర్ బోర్డు రాబడి అంతకంతకూ పెరుగుతోంది. ఈసారి 52లక్షల పైచిలుకు భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని సందర్శించారు. ఈ ఏడాది 435 కోట్ల ఆదాయం వచ్చింది. శబరిమల చరిత్రలో ఇది రికార్డు స్థాయి హయ్యెస్ట్ ఇన్‌కమ్. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 89 కోట్లకు పైగా రాబడి పెరిగినట్టు తెలుస్తోంది. ఎప్పట్లానే ఈసారి స్వామివారికి తిరువాభరణ సేవ కనుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం సాయంత్రం వరకు నెయ్యి అభిషేకం,కలశాభిషేకం సహా ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. రాత్రి పది తరువాత ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఏడాదిలో దాదాపు 9 నెలల పాటు ఆలయం మూసి ఉన్నప్పటికీ, మలయాళం క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ప్రారంభంలో వచ్చే మొదటి 5 రోజులు ఆలయాన్ని ప్రత్యేక నెలవారీ పూజల కోసం తెరుస్తారు. విషు, ఓనం వంటి కొన్ని ముఖ్యమైన పండుగలకు కూడా ఆలయాన్ని తాత్కాలికంగా తెరుస్తారు. అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి రూపంలో ఉంటారు కాబట్టీ నిత్య పూజలు, నిరంతర దర్శనం ఉండకూడదనే సంప్రదాయం కొనసాగుతోంది. అత్యంత పవిత్రమైన మండల, మకరవిళక్కు పండుగల కోసం ఆలయాన్ని సిద్ధం చేయడానికి, సంప్రదాయాలను గౌరవించడానికి, అటవీ ప్రాంతంలోని సవాళ్లను దృష్టిలో ఉంచుకుని శబరిమల ఆలయాన్ని కొన్ని నెలల పాటు మూసివేస్తారు. మకర దివ్యజ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమైంది. హరివరాసనం పూజతో ఈ ఏడాది ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. సోమవారం రాత్రి పది నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించరు. మంగళవారం సంప్రోక్షణ తరువాత ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మధ్యలో పండగల సందర్భంగా ఆలయాన్ని తాత్కాలికంగా తెరుస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
Vande Bharat: ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?