రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ

Updated on: May 19, 2025 | 9:15 PM

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణ సన్నిధి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు ..

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత  శ్రీ మోహన కృష్ణ స్వామి వారికి ఉంజల్ సేవ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు.  గీతాంజలి కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. రుక్మిణి సత్యవాణి సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి వారిని ఊయలపై ఊపుతూ భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ గాయనీగాయకులు తమ గాత్రంతో స్వామివారి సేవలో తరించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 

Published on: May 19, 2025 09:10 PM