RS Praveen: ‘BSPలో కంటే BRSలోనే ఎక్కువ స్వేచ్ఛ దొరికింది’

Updated on: Sep 14, 2025 | 8:24 PM

టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆర్.ఎస్. ప్రవీణ్, బిఎస్పీ కంటే బిఆర్ఎస్ పార్టీలో తనకు ఎక్కువ స్వేచ్ఛ లభించిందని చెప్పారు. బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తన అనుభవాలను, బిఆర్ఎస్‌లో తనకున్న స్వాతంత్ర్యాన్ని వివరించారు. ప్రజా సమస్యలపై తనకున్న నిబద్ధతను కూడా ప్రవీణ్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో ఆర్.ఎస్. ప్రవీణ్ తన రాజకీయ అనుభవాల గురించి వివరించారు. తన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎక్కడున్నా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బహుజన సమాజవాది పార్టీ (బిఎస్పీ) లో చేరిన తర్వాత తనకు ఎదురైన అనుభవాలను, తరువాత భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో చేరిన తర్వాత పొందిన స్వేచ్ఛను ప్రస్తావించారు. తాను ఏం మాట్లాడాలనుకున్నా.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. ముందుకు వెళ్లే స్వేచ్చ BRSలో లభించిందన్నారు.  బిఎస్పీ కంటే బిఆర్ఎస్ లో బహుజనులకు మంచి స్థానం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.