Telangana: బస్టాండులో బస్సు కోసం మహిళ వెయిటింగ్.. ఇంతలో జరగాల్సింది జరిగిపోయింది.. కట్ చేస్తే

Updated on: Sep 23, 2025 | 8:49 AM

ఓ మహిళ నారాయణపేట వెళ్లేందుకు మక్తల్ బస్టాండ్‌లో బస్సు ఎక్కబోయింది.. ఈలోపు ఆమె చేతిలోని బ్యాగ్ చిన్నగా జారింది. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది.. దెబ్బకు ఆమె పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టింది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళా ప్రయాణీకురాలి హ్యాండ్ ‌బ్యాగ్‌లో వస్తువులు చోరీకి గురయ్యాయి. ఉట్కూర్ మండల కేంద్రానికి చెందిన మైమున బేగం(55)కు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదును దుండగులు అపహరించారు. నారాయణపేట బస్సు ఎక్కుతున్న క్రమంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. పాత బంగారు ఆభరణాలు అమ్మి, కొత్తవి కొనుగోలు చేసేందుకు నారాయణపేటకు వెళ్తుండగా ఈ చోరి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సదరు మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.