Telangana: టీ తాగుదామని కారు పార్క్ చేసి హోటల్‌కు వెళ్లారు.. తిరిగి వచ్చి చూసేసరికి

Updated on: Sep 02, 2025 | 12:48 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. స్థానికంగా ఉన్న హోటల్ సమీపంలోని కారు పార్కింగ్‌లో ఆగి ఉన్న కారులో నుంచి రూ. 5 లక్షలు దొంగలించారు దుండగులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. స్థానికంగా ఉన్న హోటల్ సమీపంలోని కారు పార్కింగ్‌లో ఆగి ఉన్న కారులో నుంచి రూ. 5 లక్షలు దొంగలించారు దుండగులు. బల్కంపేట ఎల్లమ్మ వైన్ షాప్ సిబ్బంది.. షాప్ ముగించుకుని క్యాష్ కౌంటర్‌లో నుంచి రూ. 5 లక్షల డబ్బులు తీసుకుని.. తమ వెంట కారులో పెట్టుకుని హోటల్‌కు వెళ్లారు. అక్కడే హోటల్ పార్కింగ్‌లో కారును పార్క్ చేసి.. టీ తాగడానికి వెళ్లారు. టీ తాగి తిరిగి వచ్చి కారును చూసేసరికి.. అడ్డం పగిలిపోయి డబ్బులు చోరీ జరిగినట్టు కనిపించింది. అక్కడే ఉన్న హోటల్‌ నుంచి ఫోన్ చేసి వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, వైన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.