తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Updated on: Nov 05, 2025 | 3:30 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోనసీమ, కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 900 మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దీనికి ప్రధాన కారణం. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎదురెదురుగా ఢీకొన్న RTC బస్సు, కారు

ఉమెన్‌ టీమిండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసల వ‌ర్షం..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే ??

Rain Alert: రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు