ఓరీ దేవుడో.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

|

Sep 01, 2024 | 11:13 AM

రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోవడంతో మట్టి కోతకు గురైంది. దీంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు, జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల కుండపోత వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోవడంతో మట్టి కోతకు గురైంది. దీంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు, జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..