టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

Updated on: Nov 06, 2025 | 4:06 PM

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద లెవెల్‌-1, 2, 3, 4, 5 లెవెల్స్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు నవంబర్‌ 10, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిగ్రీలో అర్హత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్‌, హ్యండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్, బాక్సింగ్‌, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, హాకీ, స్విమ్మింగ్.. వంటి తదితర క్రీడల్లో పాల్గొనడంగానీ, పతకాలు సాధించి గానీ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 10, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..

ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు..ఊహించని విధంగా

పంట నష్టం కింద రైతుకు పరిహారంగా రూ.2.30

భారీ షాక్‌‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి