శ్రీచరణ్‌,రాధ బంధంలో ఏంటా ట్రాకర్.. శ్రీచరణ్ తండ్రి చెప్పిన చేదు నిజాలు..

Updated on: Jun 25, 2026 | 3:49 PM

గాయత్రి మృతి కేసులో ఆమె మామ, శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భరించలేని నష్టమని, గాయత్రి తల్లిదండ్రుల బాధ రెట్టింపు ఉంటుందని అన్నారు. ట్రాకర్ గురించి శ్రీచరణ్ తనకు తెలియదని చెప్పాడని, తన కొడుకును సరిదిద్దే ప్రయత్నం చేశానని తెలిపారు. దర్యాప్తునకు సహకరించాలని సూచించినట్లు వెల్లడించారు.

విశాఖపట్నంలో జరిగిన రాధా గాయత్రి మృతి కేసులో ఆమె మామ, శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తమ కుటుంబానికి భరించలేని నష్టమని, గాయత్రి తల్లిదండ్రుల బాధ రెట్టింపు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయని, కోర్టు తుది నిర్ణయం చెబుతుందని దుర్గాప్రసాద్ అన్నారు.శ్రీచరణ్‌పై వస్తున్న ఆరోపణల గురించి స్పందిస్తూ, ట్రాకర్ గురించి తన కొడుకుకు తెలియదని శ్రీచరణ్ చెప్పినట్లు వెల్లడించారు. తన కోడలిని తాను మంచి స్నేహితురాలిగా భావించానని, ఆమె మరణం తనకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందని చెప్పారు. శ్రీచరణ్ తనను తాను పర్ఫెక్ట్ అని భావించేవాడని, కొన్ని సందర్భాల్లో అతని ప్రవర్తనపై తాను, తన భార్య హెచ్చరించినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. ట్రాకర్ వివాదం సమయంలో శ్రీచరణ్ తల్లి తన కొడుకును కొట్టినట్లు కూడా ఆయన వెల్లడించారు.పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రీచరణ్‌కు సూచించినట్లు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లి పోలీసులను కలిసి పరిస్థితిని వివరించాల్సిందిగా చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, దర్యాప్తు పూర్తయ్యే వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని దుర్గాప్రసాద్ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ.. చిరు మెచ్చిన బంగారం సమంత

ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష

‘చేతబడులు.. క్షుద్ర పూజలు..’ సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాలంటే ఈ సిరీస్ చూడండి!

Follow Us