President Murmu: హకీంపేటకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..(వీడియో)

Updated on: Dec 26, 2022 | 5:36 PM

భారత రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్‌‌లోని హకీంపేటకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.

భారత రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్‌‌లోని హకీంపేటకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. చాలా రోజుల తరువాత ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై కనిపించడం విశేషం. కాగా, ఇవాళ రాత్రికి రాష్ట్రపతి గౌరవార్థం ద్రౌపది ముర్ముకు రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్నారు గవర్నర్ తమిళిసై. ఇకపోతే సోమవారం ఉదయం శ్రీశైలం వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు రాష్ట్రపతి ముర్ము.

Published on: Dec 26, 2022 05:31 PM