విశాఖ పర్యటనతో పవన్ కళ్యాణ్ సాధించింది శూన్యం – వారాహీ యాత్రపై వైవీ సుబ్బారెడ్డి పైర్

| Edited By: Janardhan Veluru

Aug 18, 2023 | 10:58 PM

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ లో నిర్వహించిన వారాహీ యాత్ర అధికార వైఎస్సార్సీపీ జన సేన ల మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. దాదాపు ఏడు రోజులపాటు సాగిన ఈ వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ లో నిర్వహించిన వారాహీ యాత్ర అధికార వైఎస్సార్సీపీ జన సేన ల మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. దాదాపు ఏడు రోజులపాటు సాగిన ఈ వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆగష్టు 10 వ తేదీ సాయంత్రం విశాఖ నడిబొడ్డున ఉన్న జగదాంబ జంక్షన్ లో బహిరంగ సభ తో విశాఖ టూర్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ తన తొలి స్పీచ్ లోనే ప్రభుత్వం పై విరుచుకుపడి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. జగన్ ఒక దోపిడీ దారంటూ ప్రారంభించి హెల్లో ఏపీ – బై బై వైసీపీ అంటూ తీవ్ర స్థాయిలో అధికార పార్టీ పై ఆరోపణలను పునరుద్ఘాటించారు.

జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ లో నిర్వహించిన వారాహీ యాత్ర పై టీవీ9 తో వైవీ సుబ్బా రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. వారాహీ యాత్ర లో ప్రభుత్వం పై పవన్ చేస్తున్న విమర్శలను ఖండించారు సుబ్బా రెడ్డి. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల విషయం లో చిత్త శుద్ది ఉంటే పవన్ చర్చ కు రావాలంటూ సవాల్ చేశారు సుబ్బా రెడ్డి. ఎర్రమట్టి దిబ్బల పరిసర ప్రాంతాల్లో లాండ్ పూలింగ్ చేసింది టీడీపీ హయాంలోనే ఆన్న సుబ్బా రెడ్డి రుషికొండ పై అక్రమ నిర్మాణాలు ఉంటే సుప్రీం కోర్టు వదిలేస్తుందా? అని ఎదురు ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వం పై దురుద్దేశం తో ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు రుషికొండ కు లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంటే పవన్ ఫ్రెండ్ చంద్రబాబు బంధువుల గీతం విశ్వవిద్యాలయ అవరణలో ఆక్రమించిన ప్రభుత్వ భూమి ఉందనీ, గీతం ఆక్రమణలు పవన్ కు కనపడవా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి తరిమేస్తే ఉత్తరాంధ్ర పై పడ్డారు అంటూ పవన్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారని, అలా తెలంగాణ లో తడిమితే ఉత్తరాంధ్ర లో పడింది చంద్రబాబు నాయుడేనన్నారు సుబ్బా రెడ్డి.

Published on: Aug 18, 2023 10:53 PM