Watch Video: బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు.. పోలీసులకు ఫిర్యాదు..

Updated on: Jun 13, 2024 | 9:55 AM

గుంటూరు శ్రీనగర్ కాలనీలో బోరు గడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‎ల‎పై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు కొందరు వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు.

గుంటూరు శ్రీనగర్ కాలనీలో బోరు గడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‎ల‎పై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు కొందరు వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఆ ఘటన తరువాత తాజాగా మరోసారి అదే కార్యాలయానికి నిప్పు పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడుగా బోరు గడ్డ అనిల్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‎లపై పలుమార్లు అనేక విమర్శలు చేసినట్లు అభిమానులు చెబుతుండటమే ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు, ఆధారాలు వెలుగులోకి రావల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us