Watch Video: చంద్రబాబును జైల్లో ఎవరూ ఇబ్బంది పెట్టరు.. మాజీ మంత్రి బాలినేని కామెంట్స్
చంద్రబాబును ఉద్దేశ్యపూర్వకంగా ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. చంద్రబాబు వైద్యం కావాల్సి వస్తే తప్పకుండా వైద్యం అందిస్తారన్నారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పటికీ.. ఇప్పటికి కేజి బరువు పెరిగారని డాక్టర్లు చెబుతున్నారని గుర్తుచేశారు. టిడిపి నేతలు మాత్రం బరువు తగ్గారని ప్రచారం చేస్తున్నారని అన్నారు.

కాగా వైసిపి నాయకులను క్రమశిక్షణ పేరుతో కావాలని సస్పెండ్ చేస్తే తప్పకుండా వారికి అండగా ఉంటానన్నారు. సియంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అయితే వారు తప్పు చేస్తే మాత్రం తాను సపోర్ట్ చేయనన్నారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంలో ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్‌పిలను కోరినట్లు తెలిపారు.
Published on: Oct 14, 2023 01:09 PM