YS Vijayamma: పోలీసును కొట్టిన వైఎస్ విజయమ్మ.. వీడియో చూడండి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను చూడడానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వచ్చారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను చూడడానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వచ్చారు. అయితే స్టేషన్ లోకి విజయమ్మను అనుమతించకపోగా కనీసం షర్మిలను చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. దీనితో పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో విజయమ్మ వారితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు విజయమ్మను ఆపుతున్న ఓ పోలీసుపై ఆమె చేయి చేసుకున్నారు. విజయమ్మను నియంత్రిస్తున్న ఓ పోలీస్ చెంపపై ఆమె కొట్టారు.
Published on: Apr 24, 2023 06:28 PM