YS Vijayamma: వైఎస్ జగన్ – షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ.!

|

Oct 30, 2024 | 11:12 AM

జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు విజయమ్మ కీలక లేఖ రాశారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని.. జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తానెంత ప్రయత్నించినా జరగకూడనివి తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు విజయమ్మ కీలక లేఖ రాశారు. తానెంత ప్రయత్నించినా జరగకూడనివి తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం, పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతున్నానన్నారు. వైఎస్ బతికుండగానే ఆస్తులు పంచారనడం అవాస్తవం అని.. కొన్ని ఆస్తులు షర్మిల పేరుతో ఉన్నాయన్నారు. మరికొన్ని ఆస్తులు జగన్‌ పేరుతో ఉన్నాయని చెప్పారు. అది ఆస్తులు పంచడం కాదన్నారు. అబద్ధాల పరంపర కొనసాగకుండా నిజం చెబుతున్నానని..ఇద్దరు పిల్లలూ తనకు సమానమేన్నారు. రాజశేఖర్‌రెడ్డి మాట సమానమే ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమే అని.. నలుగురు చిన్న పిల్లలకు సమానంగా వాటా ఉండాలన్నది వైఎస్ ఆజ్ఞ అని విజయమ్మ లేఖలో తెలిపారు. ఆస్తుల వృద్ధిలో జగన్‌ కష్టం ఉందనేది నిజమే అని.. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అని ఆమె లేఖలో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on