Watch Video: చంద్రబాబు లేఖపై చర్యలు తీసుకోవాలి.. కోర్టుకి యనమల వినతి

|

Oct 27, 2023 | 7:02 PM

రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ ఏసీపీ కోర్టుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం తెలిసిందే.  ఏసీబీ కోర్టుకు చంద్రబాబు ఈ నెల 25న లేఖ రాస్తే దాన్ని ఈ రోజు వరకు ఎందుకు పెండింగ్‌లో పెట్టారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ లేఖ జడ్జికి చేరిందో లేదో తెలియదని అన్నారు. లేఖలో చాలా సీరియస్‌ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్‌గా తీసుకోవాలని యనమల కోరారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ ఏసీపీ కోర్టుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం తెలిసిందే.  ఏసీబీ కోర్టుకు చంద్రబాబు ఈ నెల 25న లేఖ రాస్తే దాన్ని ఈ రోజు వరకు ఎందుకు పెండింగ్‌లో పెట్టారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ లేఖ జడ్జికి చేరిందో లేదో తెలియదని అన్నారు. లేఖలో చాలా సీరియస్‌ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్‌గా తీసుకోవాలని యనమల కోరారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించే కేంద్రం ప్రభుత్వం ఆయన భద్రత పెంచుతూ పోయిందని యనమల గుర్తు చేశారు. చంద్రబాబుకు సరైన, అవసరమైన, ప్రభావవంతమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని యనమల కోరారు.

Published on: Oct 27, 2023 07:01 PM