Watch Video: చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్
పింఛన్ల పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని చూసైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు రూ.4 వేలకు పింఛన్లు పెంచారని.. ఆ మేరకు మొదటి సంతకం పెట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు.
పింఛన్ల పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని చూసైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు రూ.4 వేలకు పింఛన్లు పెంచారని.. ఆ మేరకు మొదటి సంతకం పెట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ఏపీని చూసైనా నేర్చుకోవాలని.. రూ.4 వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వారిపై చట్టపరమైన చర్యలు: హరీష్ రావు
కాగా తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హరీష్ రావు స్పష్టంచేశారు. తాను కాంగ్రెస్, బిజెపిలో చేరుతున్నానంటూ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్స్ పెట్టి కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకపై ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.