Weekend Hour: 2 నెలల్లో విశాఖలో పరిపాలన ప్రారంభమవుతుందా? విపక్షాల నెక్స్ట్ స్టెప్ ఏంటి?

|

Jan 22, 2023 | 7:08 PM

ఏపీలో రాజధాని ముహూర్తం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు చెప్పినట్టే రెండు నెలల్లో విశాఖలో పరిపాలన ప్రారంభమవుతుందా? అదే నిజమైతే విపక్షాలు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్నికల ఏడాదిలో రాజధాని అంశం ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది?

అనుమానాల్లేవ్‌.. అపోహల్లేవ్‌ అంటూ విశాఖలో పాలనకు ముహూర్తం ఫిక్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం… బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ అదే బిల్లుకి మెరుగులు దిద్ది ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని క్లూస్ ఇస్తూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇక మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు జరగనున్నాయి. వాటి కన్నా ముందే ముఖ్యమంత్రి జగన్ కీ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.

Follow us on